సెకండ్ షో నుండొస్తుండగా.
ఇరవై రోజులక్రితం పోయిన మనిషి కనపడ్డాడు,
దర్జాగా పొగ తాగుతూ,
నిజంగా అతనే, వాళ్ళింట్లో కర్మకెల్లి తినొచ్చా కూడా,
ఖర్మ కాపోతే ఒక్కడ్ని చూసి భయపెట్టాలా,
కాళ్ళూ వెనక్కి లేవని చూసి,
నా కాళ్ళు ముందుకు తోసాను,
నేనేదొ అడగాలనుకుంటున్నట్టర్ధమైనట్టుంది,
"మేస్టారూ, ఎవర్తో, చెప్పకండి, అప్పులెక్కువయ్యాయ్,
ఛస్తే ఇన్సూరన్స్ డబ్బులొస్తాయన్నాటకమాడాను,
అవొచ్చాక మీ బాకీ కూడా తీర్చి, అందరమెళ్ళిపోతామెటైనా"
ఆర్నెళ్ళయ్యాయ్,
వాళ్ళింటికెళ్ళా డబ్బవసరమై,
మాటల్లో ఇన్సూరన్స్ గురించడిగా,
" మా వారికసలు పాలసీయే లేదన్నయ్యా" అతని భార్య..
ఇంకెప్పుడూ సెకండ్ షోలకెళ్ళలేదు.....
No comments:
Post a Comment