నువ్వు + నేను = ప్రేమ
మాటాడుకున్న మాటలే ఇంకా విన్పిస్తుంటే,
ఆడుకున్న ఆటలే ఎదురుగా కన్పిస్తుంటే,
పాడుకున్న పాటలే మెల్లగా జోకొడుతుంటే,
పోట్లాడుకున్న పూటలే ఏదోలా అనిపిస్తుంటే,
నువ్వు = నేను = ప్రేమ,
నీ మౌనం నాకర్ధం ఔతుంటే,
నా ప్రాణం నీకే అనిపిస్తుంటే,
నీ కన్నీళ్ళు నన్ను బాధిస్తుంటే,
నా కౌగిలి నీకు ధైర్యాన్నిస్తుంటే,
(నువ్వు + నేను) > ప్రేమ
ఎప్పుడూ నీ సంతోషం కోరుకుంటుంటే,
నీకోసమేదైనా చేయగలననుకుంటుంటే,
నీలో నన్ను నాకు చూపిస్తుంటే,
నా గెలుపుకి నన్నే ప్రేరేపిస్తుంటే,
(నువ్వు+ నేను+ ప్రేమ)=జీవితం
వయస్సు పెరుగుతున్నా తెలియలేకుంటే,
సొగసు తరుతున్నా పట్టింపు లేకుంటే,
మనసు చెదరకుండా ఒకరికొకరం ఉంటానంటే,
కలల రూపమే రేపటి పాపగా పుడతానంటే
ప్రేమ మొగ్గ తొడగటం దగ్గరనుంచి, పూచి, ఫలించటం వరకూ మీరు చెప్పిన విధానం చాలా బావుంది....
ReplyDelete