-మా లోకానిక్కొత్తా,
హా, నాకు నేనే మాలోకమన్పించేంత కొత్త,
-పూర్వాశ్రమం,
గుర్తుంటే ఇక్కడేంపన్నాకు,
-ఏం చేయగలవ్,
ప్రకృతికి పునసృష్టి చేయగల్ను,
-బ్రహ్మవా ,ఒక్కడు చాలు,
ఏ కాలానికైనా వెళ్ళి రాగల్ను,
-నీ కాలాన్ని వెతుక్కో ఫో,
మౌనాన్నీ, మాట్లాడించగల్ను,
-మానసికవైద్యుడివా, నీకే నీ అవసరమొచ్చేట్టుందే,
అభౌతికాల్నీ, అనంతాల్నీ కళ్ళక్కట్టగలను,
-మహేంద్ర జాలివా, ఏదీ, నన్ను మాయం చేయ్,
ఆశల ఊసుల్తో, కలల ఊహల్లోకి పంపగల్ను,
-అక్కడే ఉండకపోయావా, బ్రతకడానికేమొచ్చు,
"కవి"ని, "కావ్య కర్త"ని,
దబేల్మని మూసుకున్న ద్వారానికి,
వేళ్ళాడ్తోన్న "కవులకి ప్రవేశం లేదు" పతాకపు నీడలో,
నాలాంటి చాలా మంది, మనకొకడు పెరిగాడన్న ఆనందంలో,
"మరో లోకం వెతుక్కోక తప్పేట్టు లేదు".....
No comments:
Post a Comment