నాలో ఎంతమంది నేను చూడగలిగే "నేను"లు,
ఒక్కొక్క "నేను"లో,
ఎన్ని లెక్కించలేనన్ని "నువ్వు"లు,
ప్రతీ "నువ్వు"లో
ఎన్నెన్ని ఛిద్రమైన నా "మనసు"లు,
అన్ని మనసుల్లో
తరిగిపోనన్ని నీ "గురుతు"లు,
ఆ మరపురాని "గురుతు"ల్లో,
మరచిపోయిన మన కయ్యాల కథలు,
తరచి చూస్తున్న ఒక్కో కథలో,
నాకెపుడూ ఎదురవని నా రూపురేఖలు,
ఆ నా రూపాల్లో,
నా అసలు ముఖాన్ని పోల్చలేని అసమర్ధపు ఆలోచనలు,
అన్ని ఆలోచనల్ని,
ఒకదానికొకటి సంబంధంలేకుండా,
పుట్టిస్తున్న, నా సగం చచ్చిన మెదడు కణాలు,
అలాంటి మృత్యు అవస్తలో
ఉన్న నా బుధ్దిని పరామర్శిస్తూ,
నా ప్రతిస్పందనలని, ప్రతీ స్పందనని,
ప్రత్యక్షంగా చూసి, నన్నిన్నాళ్ళూ భరిస్తూ వొచ్చిన,
నా అంతరాత్మ,
నన్ను చూడలేక చూస్తూ,
అణువులుగా విడిపోయి,
నాలోని అన్ని "నేను"ల్లోకి దూరిపోయి,
నా అత్యల్ప వివేకాన్ని,
ఆకాశమంత వెర్రిని,
అంతరిక్ష్యపు ఆవలి మనస్తత్వాన్ని,
"నా"లో అలాగే ఉంచేసి,
మళ్ళీ,
మళ్ళీ మళ్ళీ
నన్నో కొత్త "నేను"గా మార్చి......
No comments:
Post a Comment