ఆకలేసి పండు తిన్నా,
పండుకీ దాహమేసి పొట్టని పీల్చింది,
ఆకల్తీరాక పండు గుర్తుకు రాలేదు,
దాహం తాగాక పండు గుర్తులేం మిగల్లేదు,
మళ్ళీ, ఆకలేస్తుంది,
పండెక్కడ పట్టాలో,
ఎక్కడో పండుకీ దాహమేస్తుంది,
ఆకలి చూపుల్నెలా పసిగడ్తుందో......
No comments:
Post a Comment