చుక్కలు చంద్రుణ్ణి మింగేసిన "అమాస" రాత్రి,
చలి గాలికి గడ్డకట్టి వొణుకుతున్న చెట్ల నడుమ,
సర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
భడ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్డ్,
బ్రేకేసినా ఆగక ,
పాత చేతక్ ని, ముద్దగా,
కుర్చున్నోళ్ళని రక్తపు ముద్దగా చేసి,
మూగపోయిన "ట్రక్" ,,
"పట్టుకోండ్రా నా కొడుకుని",
ఎదురుగా వొచ్చిన పోలీస్ జీప్ ఛేదించిన నిశ్శబ్దం,
"సార్సార్, నా పిలగాడుసావుబతుకుల్లల్లున్నడు,
పొద్మీకి బండి పడ్డది, పట్నంల పెద్దాస్పటల్ల
శరీక్ జేసిర్రని జల్దీల సూస్కోలే సా..
ఇడిసేయండ్రి, ఇగో 50,000,,
దవాఖానక్కొంచబోతున్నా" ఏడుస్తూ ట్రక్ డ్రైవర్,
నిజమా కాదా అని కాక,
కాసేపు కళ్ళు మూస్తే పెరిగే జేబు బరువాలోచిస్తూ "ఖాకీ",
నల్ల నాగు పడగ నీడలో చేతులు మారిన పైకం,
చీకటిని మరింత మత్తెక్కిస్తూ,
ఉదయం టీవీ వార్తలు,
నవ్వు మొఖంతో రీడర్,
" రోడ్డు ప్రమాదానికి, కొన ఊపిరిని ఆస్పత్రిలో పోగొట్టుకున్న వృధ్ద జంట",
కట్టలు కట్టిన "ఖాకీ' కన్నీటి ధార స్టేషన్లో,
రాత్రే రావాల్సిన అమ్మానాన్న
ఇంటికెందుకు రాలేదో తెలిసి,,,
ధబ్ దబ్ దబ్ దబ్బ్, క్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్చ్చ్చ్చ్cచ్.....
ఎక్కడో,
అంటిన రక్తం, కడుక్కుంటున్న మరో పచ్చనోటు.....
No comments:
Post a Comment