కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Sunday 22 April 2012

* లిబిడో *


-"నాన్న, నా ఫ్రెండ్ లాలిత్య. ఈవేళిక్కడే పడుకుంటుంది,
వాళ్ళమ్మూరెళ్ళింది, నేనే అక్కడికెళ్దామన్కున్నా,
పక్కనే బాయ్స్ హాస్టల్, భయమేసింది"
తల్లిని పురిట్లోనే పోగొట్టుకున్న ఇరవైనాలుగేళ్ళ నా తల్లి,
మాటలో, ముఖంలో, అన్నింటా వాళ్ళమ్మనే గుర్తుచేస్తూ.

అలాగే రా, నవ్వుతూ నేను,
ఇరవయ్యేళ్ళ స్నేహం వాళ్ళది..

-"నాన్న, రేపాఫీస్లో ఇన్స్పెక్షనట, నేన్రాడానికి లేటయ్యేట్టుంది,
అదింటికొస్తే కాఫీ కలిపివ్వు, పాలు ఫ్రిజ్లో, గాస్ ఆఫ్చేయ్ అయ్యాక"

అలాగే అమ్మా, పోనీ, వొచ్చి కాఫీ పెట్టి పోరాదూ, నీ ఫ్రెండ్కి,
తన నవ్వు మార్దవంగా, ఫోన్లో,
కావేరీ ఇలాగే చెప్పే ఙ్నాపకం గుండెల్ని పట్టేస్తుండగా,

-"నమస్తే అంకుల్"..
రా అమ్మా, దానికాఫీస్లో పనుందట,
-"చెప్పిందంకుల్, మీక్కంపనీ ఇవ్వాలనే వొచ్చాను"
మాటల్లో మామూలుతనం కన్పించలేదు,
ఫ్రెషయి రా అమ్మా, కాఫీ తాగుదూ, కళ్ళు తిప్పుకుని నేను...

-"అంకుల్. ఈ చీరెలా ఉంది,
నాక్కట్టుకోడమసలే రాదు, దానివి నాకు పట్టవు,
షెల్ఫ్ లో ఇది కన్పించింది"

అది వాళ్ళమ్మ గుర్తుగా దాచుకుందది,
నువ్ ముట్టుకోకుండా ఉండాల్సింది,
కోపం కన్పించకుండా, అప్రయత్నంగా దూకిన చివరి మాటలు,

కన్నీరు పొంగుతుండగా చీర సగంవిప్పి, సన్నగా ఏడుస్తూ తను,
ఏంటీ పిల్ల, ఈ మాత్రానికే ఏడుపా, గట్టిగా మందలించానా,
అమ్మా, నేనలా అన్లేదు, నిన్ను బాదపె...ఇంకేదో అనేలోపు,
గట్టిగా పట్టుకుని,

"అంకుల్, తప్పు నాదే, నన్ను క్షమించకండి"
ఆలింగనంలో ఏదో కామన కనపడ్తుండగా..
ఎలా విడిపించుకోవాలో తెలీక,
అసలేం జరుగుతుందో ఊహించేలోపు,

"మా నాన్ననెపుడూ చూళ్ళేదు,
అందరూ జాలి కురిపిస్తుంటే, అమ్మనేమనడగాలో తెలిసేది కాదు,
చిన్నప్పట్నించీ మీరంటే ఆరాధన,
అదెప్పుడిలా శారీరావసరమైందో నాకూ తెలీదు"
కళ్ళు తడిపిన భుజం రాలుస్తున్న నీటి బొట్లు విన్పించేంత నిశ్శబ్ధం,

-"అంకుల్, కాదనకండి, ఆలోచించకండి"
తన గుండె చప్పుడుకొణుకుతున్న నా చేతులు,
కావేరి పోయాక, మోడైన నాకు వసంతమందుతున్న అవకాశమా,
ఒరేయ్, ఫ్రాయిడూ, నువ్వైతే ఏం చేసేవాడివని మూగగా రోదిస్తున్న ఙ్నానం,
క్షణకాలం మనసు చెదిరి దగ్గరౌతున్న తనువుల్ని,
దూరంగా తోసి పరిగెత్తిన్నాలోపలి తండ్రి,

అమ్ సారీ, ఫర్గివ్ మి, పశ్చాత్తాపం పాము బుస కొడుతుండగా....

గదిలోకెళ్ళిపోయిన తను,
అమ్మాయాఫీస్ నుండొచ్చేవరకు ఇల్లంతా స్మశాన శైథిల్యమై ఉండగా,

రెండ్రోజులాయ్యక,
నాన, నాన, అదీ, అద్..లాలి..లాలిత్య..
కమిటెడ్ సూసైడ్,
భయంతో కంపిస్తున్న తన గొంతు,
నన్నింకా భయపెడుతుండగా..

వాళ్ళింటిముందు
ఏడవడానిక్కూడా బంధువుల్లేక,
ఒంటరి శవం, వాళ్ళమ్మ పిచ్చి చూపులు తప్పించుకుంటూ

వీధిలో కుక్కలు,
"ఆ ఏముంది, ఎవడో మోసం చేసుంటాడు,
మోసపోవడమలవాటేగా, తల్లీ,బిడ్డలకి"

"నన్నెప్పటికీ క్షమించకు లాలిత్య,
నేనే నిన్ను మోసం చేసానా,
బట్, ఐ కుడెన్ట్ డు దట్ టు యూ"
కుక్కలకి జవాబిచ్చే ధైర్యం లేక,

నాలో నేనే అరుచుకుంటూ.....

No comments:

Post a Comment