తెల్లవారింది, తొందరగా
తగిలించుకుందాం రండి సామాజికుడి ముఖాన్ని....
లోపల, కనపడని,
ద్వేషం, మోసం, కుట్రలు, కుయుక్తులు
ఉన్నా..కనపడకుండా కప్పి..
సరిచేసుకోండి, మన
ముఖాల్ని
కప్పేసిన ముసుగుని
ఒకటి చెప్పాలని, మరోటి
చెప్తూ
అడగాల్సినవి, అడక్కుండానే
అడుగుతూ
కలిసి, సహజీవనం
చేద్దాం రంఢి.
మనసులకి ప్రేమ పూతలు పూసుకుని,
ఒకరినొకరం అసహ్యించుకుంటూ
మనం కూడా సంఘజీవులమే అని
చాడడానికి రంఢి
ఒకరికొకరం
అస్సలు అర్దం కాకుండా
కలిసి, మనిషిగా
చస్తూ
మరమనిషిగా....మరొ మనసుతో....పుడదాం...రండి
ఉపకారికి కూడా అపకారం చెసే ఆలొచనల్ని,
మనసులొనే తొక్కి పెట్టి
సంస్కారులుగా, సంసారులుగా, కనిపిద్దాం, రండి
"అంతా
మనవాల్లే"
నీతులకు నిప్పెడుతూ, మనస్సాక్షిని
మభ్యపెడుతూ
.అందరిలో ఒంరిగా, ఒంటరిలో
జతకోసం తపిస్తూ
నీకు నువ్వే జంటగా,
మారిపోతూ, ఆరిపొతూ
ఇదేగా మన జీవితం
ఇలాగేగా మనకు ప్రతి క్షణం .....
No comments:
Post a Comment