నిన్ను మర్చిపోవాలంటే,
ఎక్కడ్నించి మొదలుపెట్టాలి
8 ఏళ్ళప్పుడు చుసినప్పట్నించా
10ఏళ్ళప్పుడు
నీతో ఆడినప్పట్నించా
నా అమాయకత్వం మొత్తం మరవాలా
కొన్నేళ్ళ కింద మళ్ళీ కొత్తగా పరిచయమైనప్పట్నించా
కొన్నాళ్ళ కింద జంటగా పరిణమించినప్పట్నించా
ఇంకెపుడూ నాకు దక్కని సంతోషం, సాంతం
మరవాలా
ఎవ్వరినైనా ఎదిరించేంతగా పెనవేసుకున్న బంధంనించా
నువ్వెవరినీ వొదులుకోలేనని చెప్పిన బేలతనపు బాధనించా
నిజం కాని ఆశని నమ్మడం మొదలుపెట్టిన క్షణంనించా
నిజంగా ఓడిపోతున్నా నవ్వడం నేర్పిన జీవితసత్యంనించా
నిన్ను మరుస్తూ, నన్ను
నేను మరచిన దుస్థితినించా
నిన్ను మరచిన తక్షణం, నాకు
నేను అపరిచితమయ్యే శాపంనించా.......
No comments:
Post a Comment