నేను నమ్మను,
జాజుల పరిమళం నీ వల్ల రాదంటే
పూజల ప్రతిఫలం, నీ
చూపు తేలేదంటే
పాలరాతి సున్నితంలో, నీ
ప్రతిభ లేదంటే
పావురాయి సౌకుమార్యం, నీ
ప్రమేయం కాదంటే
నేను నమ్మాను,
రంగులన్నీ పోగేసినా నీ వర్ణం రాదంటే
హంగులన్నీ తీసేసినా, నీ
అందం నీదే అంటే
లేత కొబ్బరికొచ్చిన రుచి, నీ
ఎంగిలే అంటే
పాత ఆవకాయకిచ్చిన శుచి, నీ
చేతులదే అంటే
No comments:
Post a Comment