ప్రతిరోజూ బ్రతుకో పోరాటం
ఎలాగైనా బ్రతకాలనే ఆరాటం
భయం భయంగా బ్రతికే బ్రతుకు
నిజం నిజం, అది
బ్రతుకే కాదు
గ్రీష్మాన దూషించిన సూరీణ్ణి,
శిశిరాన అనవసరం అన్నామా
హేమంతాల హిమబిందువులు,
ఆషాఢాన కోరుకోకుండా ఉన్నామా
నీకు లోకం అనవసరమైతే, లోకానికి
నీ అవసరం లేదా
బ్రతకడానికి లేని ధైర్యం, ఛావడానికెవర్ని
అరువడుగుతావ్
ప్రాణం లేని శిల శిల్పమైతే,
ప్రాణమున్న నువ్వు శల్యమౌతావా
గాయమవని వెదురు వేణువౌతుందా
దెబ్బ తినని మనసు రేపుకి రూపమిస్తుందా.........
అస్తమిస్తున్న రవిని, అర్నవం
తనలో దాచుకోదా
అంతరిస్తున్న శశిని, నిశి
తనలో పొదుముకోదా
ఆశయంతో ఉంటే నిన్ను, ఆశ
దగ్గరికి తీసుకోదా
సంశయం చూపిస్తే, గెలుపు
నీ వైపు చేరుతుందా......
*వంశీ*
No comments:
Post a Comment