నేను ఉన్నాను, ఉన్నానంతే,
బ్రతకడం వరకే నే చేస్తుంది,
జీవించడం నీ చూపుల చలవేనేమో,
నేను నవ్వుతున్నాను, పిచ్చెక్కినట్టుగా
చూసేవాళ్ళకి భయమయ్యేంతగా
నిజంగా నేను నవ్వుతున్నానా
అన్నివైపులా నిన్ను చూడగలుగుతున్నానంతేనేమో
నేను నడుస్తున్నాను, కాదు
పరుగెడుతున్నాను
నిన్నందుకోవాలని, నేనే
నీకందాలనేమో
బహుశా, ఇది
కూడా నీ పనేనేమో
నేను మాట్లాడుతున్నా, ఎడురుగా
ఎవరు లేకుండానే
ఆ మాటలు, నాలోని
నీతోనేమో
నేనేడుస్తున్నా, చూసి
నాకే నవ్వొచ్చేంతగా
ఎందుకంటే, నువ్వు
నాకు హాయిలో కంటే
బాధలోనే ఎక్కువ గుర్తొస్తావ్ కాబట్టి కావొచ్చేమో
నేను వెతుకుతున్నా, నన్ను
నేను,
ఎక్కడెక్కడో, ఎమిటేమిటో, ఎపుడెపుడో,
నీ దగ్గరికేమైనా వొచ్చిందేమో
వొస్తే, వెనక్కి
పంపకు
తిరిగి రావాలనుకుంటే నన్ను వీడేది కాదేమో
నిన్ను చేరడానికి రాదేమో
ఇప్పుడు, నీ
మనసు నీ దగ్గరే ఉందా చూసుకో
అది ఇక్కడే నా పక్కనే కనపడ్తున్నట్టుంది
ఉన్నట్టు పొరబడిపిస్తుందేమో.......
నిజంగా నేను నవ్వుతున్నానా
ReplyDeleteఅన్నివైపులా నిన్ను చూడగలుగుతున్నానంతేనేమో
ఎంత బాగా రాసావ్ వంశీ..loved the feel..!