కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday 23 June 2012

*ఆధునికీక"రణం"*



పురా ప్రణయాన్ని పాతాళ ప్రతిష్ఠచేసి,
ప్రస్తుత పరిణయానికై పరుగు తీస్తూ
తొలి స్పర్శ ఙ్నాపకాలు చెరగకముందే
తడి తనువుల సాన్నిధ్ధ్యానికి ఉబలాటపడుతూ
మనసు ముక్కలు చేస్కుని, సౌకర్యానికి, సమయానుకూలంగా
తగినట్టు పంచుతూ.........
తగకపోతే, తగ్గకపొతే, వంచిస్తూ........
అమలిన ప్రేమని, ఆ మలిన ప్రేమగా మారుస్తూ
అవసరమైతే తమ్ము తామే ఏమారుస్తూ
అనవసరంగా అమాయకపు స్నేహాల్ని పరిమారుస్తూ
అన్యాపదేశంగా "భ్రమా"యకపు మాయలో పడి,
రాని దానికి, కాని దానికి విలపిస్తూ తపిస్తూ
అదృష్టంగా నిన్ను చేరిన నిజమైన అనిజని,
కావాలని కాదనుకుని మరో తప్పు చేస్తూ........

* వంశీ *

No comments:

Post a Comment