తాగిన గరళం రక్తంలో కరిగిపోతుంది
ఆఘ్రాణించిన పరిమళం ఊపిరిలో నిండిపోతుంది
చెదిరిన స్వప్నం గతంలోకి జారిపోతుంది
ఫలించని మోహం కలల్లో కవ్విస్తుంది
చలించని మనసు ఎదురుచూపు చూపిస్తుంది
ప్రణయించని యవ్వనం అనుభూతిని కోల్పోతుంది
ఏడిపించిన అనుభవం నవ్వడానికి నటిస్తుంది
విభేదించిన స్నేహం, ఏదో
మజిలిలో వికసిస్తుంది
విస్మరించిన బాధ్యత విచిత్రంగా బయటపడ్తుంది
వికృతంగా భయపెడుతుంది
కరిగించిన కాలం, అంతిమయాత్రకి
దూరం తగ్గిస్తుంది
కసి పెంచిన యుధ్ధం, నీ
లోపలికి దారి చూపిస్తుంది
వికటించిన పరువం, కన్నీటి
పొర కప్పుతుంది
కన్పించని గమ్యం, అలుపులేని
నడక నేర్పిస్తుంది
కదిలించిన దృశ్యం, అలవాటు
లేని నడత మారుస్తుంది
కలహించిన మనసు నరకం చూపిస్తుంది......
No comments:
Post a Comment