నన్ను చూసి నవ్వి వెనక్కెళ్ళింది,
మరో వర్షం,
రెండేళ్ళుగా, అలవాటైంది,
కాలంతో ఓడిపోడం,
కాలంతోనే రాజీపడ్డం,
గ్రాడ్యుయేషన్కే ఉన్నదంతా అమ్మాల్సొచ్చినింట్లో,
ఉద్యోగం దొరకలేదంటే అప్పు చేసి డబ్బు పంపే స్థితిలో,
నేనేదో ఉధ్ధరిస్తానని, వాళ్ళు
జీర్ణమైతూ,
నా కడుపు నింపుతుంటే,
చేతికందిన కూడు, నోటికెందుకు
రాలేదంటే,
పుట్టిన పాపానికి పేరెనక పడి
చచ్చిన తోకను చూపనా,
సరస్వతి చూడకపోయినా బలహీనతను
కప్పుకుని బలవంతులైనవారని చెప్పనా,
రిజర్వేషన్, హ హ హ
హ ,
విద్య కీ రిజర్వేషన్లా,
నైపుణ్యం లేని ఓ ఇంజనీర్,
పరిఙ్నానం లేని వైద్యుడా,
పరిపూర్ణుడవని పోలీసూ,
ప్రపంచ విషయాల్తెలీని ఓ ఆర్థిక వేత్తా,
రండ్రండి,
దేశమిప్పటికే నాశనమైంది,
మీరూ చెయ్యేసి స్మశాన శ్యామలం చెయ్యండిక,
అరాజకీయ నాయకుల్లారా,
ఓటు బాంక్ గట్టిపడ్డానికింకా రిజర్వేషన్లు పెంచి,
జనాల్ని సొమరుల్నీ,
మిమ్మల్ని అమరుల్నీ చేస్కోండి,
కుల ప్రాతిపదిక కాకుండా,
ఆదాయ ప్రాతిపదికన వితరణలివ్వలేరూ???,
చావలేక, చచ్చేదాకా
బ్రతకలేక,
తిండి దొరికితే పెట్టి పుట్టామనుకుని,
లేపోతే ఎందుకు పుట్టామని,
నీర్లేక పైర్లెండి, నిరాశకి
ఊపిర్లెండి,
ఉనికి కోసం, ఉపాధి
కోసం,
మొఖం మరచిన మెతుక్కోసం,
కన్ను మరచిన కునుక్కోసం,
రోజూ యుధ్ధం చేస్తూ సగం రాజ్యం,
ఇప్పటికైనా,
కళ్ళు తెరవక పోయినా పర్లే
నటించకండి నాయకుల్లారా,
చర్చలూ, సంపాదకీయాల్రాయకపోయినా
పర్లే,
కాస్తాలోచించండి మేధావుల్లారా,
ఎందుకంటే,
మీదాకా వొచ్చాకే గమనం మొదలెడితే,
గమ్యం గగనమే,
ఎందుకంటే,
ఇదో సమస్యే కాదనుకుని, సదస్సుల్లో
ఖండిస్తుంటే,
దేశం మింగుతోంది గరళమే.....
No comments:
Post a Comment