కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday, 14 July 2012

* "బాపు" *



కొట్టంల సజ్జ మీద 
ఎల్లిగడ్డల గుత్తులెన్కపొంటి, దాక్కున్నా, 
చేతిల ముల్లుగర్రతోని నన్ను దేవులాడుకుంట 
"
బాపు", 

-"
కీసల పైసల్దాస్తె ఎత్కపోతాండని, 
నడింట్ల తనాబిల పెట్టి బేడమేస్తె, 
అవి కుడ్క దెంకపోతావ్ రా, 
కొడ్క సచ్చినవియ్యాల నా శేత్ల, 
తాల్లల్ల కల్లు తాక్కుంట, 
ఊర్లె తీన్ పత్తాడుకుంట, 
పట్నంల శోకు పడుకుంట, 
లంగ కాయికాలిడుస్తవా లేదా, 
పొలగా, 
ఇత్తనాలగ్గొడ్లమ్మితిమి, 
బోర్ బాయికి భూమి తన్కవెడ్తిమి, 
పురుగుసొచ్చి రేగడి పత్తంతా పాయె, 
సద్దామని ఎండ్రిన్ కొన్నీకి పైసల్దాస్తె నువ్వెత్కపోతివి, 
ఎట్ల సావాలింకా....."

నా జిందగీల , బాపేడ్సుడు నేన్జూసుడు గదే మొదాలు, 
యే, ముసలోడు, గట్లె ఒర్రుతడు, 
సస్తడా, పీక్తడా తీయ్, 
బాపుకు దొర్కకుంట కోమటి దుక్నంల బీర్ తాగి, సల్లవడ్డ, 
మాపటికింటికిపోక, 

పొద్దుగాల్ల, 
"
మీ అయ్య, పొద్మీకి రేగడి భూమమ్మి నీకీ 
లిపాప, పైసలీమనె. గాభర గాభరుండె, 
బిరాన పో ఇంటికి" 
బొంగురుగొంతు శావుకార్, 
నా నిద్రమబ్బు దులిపి, ఏదో ఇవుసం దాసుకుంట, 

లిపాపల, బాపు రాశ్న కారట్, 
"
ఎవుసం పిరమైందిరా
నాతోని గాదింక, పైసల్దీస్కని పట్నంపో, 
లగ్గం జేస్కో, పిలగాల్లను సదివియ్యి, 
నేన్నీకు జేశినట్టు చేయకు, 
మందెక్కువ తాగకు, 
పెయ్యి నాశనం, 
నా పీనుగ మీ అమ్మ బొంద పక్కన్నే పె...
పోతున్నా బిడ్డా, 
పైలం....

2 comments:

  1. బాపు గుర్తొస్తే నాకు కళ్ళ ఎంట దారలు గడ్తాయి
    ఏడ్చి ఏడ్చి అవ్వ కు కళ్ళల్లో నీళ్ళే కరవు అయినవి
    ఈ కవిత చూస్తె
    పండిన దాన్యం అమ్ముకొని
    నన్ను పట్నం చదవులకు పంపిస్తూ
    కన్నీటి పొరలు కదులుతున్న కళ్ళతో
    వీడ్కోలు చెప్పడం నాకింకా గుర్తే " అన్న వాక్యాలు గుర్తుకు వస్తాయి
    కాకుంటే ఇప్పుడు ఆ వీడ్కోలు కూడా నాకు దక్కడం లేదు
    కారణం బాపు సమాదుల వనం లో
    కలల సేద్యం చేస్తున్నాడు !
    కొడకా జర కొలువు లో జేరు
    సుకపడ్తావ్ లగ్గం జేసుకో అన్న బాపు మాట మల్లె గుర్తు జేసావ్ వంశీ
    శోకం తో .సీతారాం

    ReplyDelete
  2. Vamsi,

    You knife is sharp at both ends... you can write both to delight people as well to make them wail. Very touching poem. It is hard to realize the worth of the sacrifices made by parents so long as they are alive.

    with best regards

    ReplyDelete