కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Monday, 2 July 2012

* నీడలూ నిజాలు *



అప్సర బార్, సికంద్రాబాద్, 11.30.
ఆరు లార్జ్ లు, నాలుగు ఫింగర్ చిప్స్,
ఒక చికెన్ మంచూరియా ,
కడుపులో, ఆసిడ్ తో ఆడుకుంటూ,
నికోటిన్ ఊపిరిలో దూరి ఊహల్లో చేరి,
ఉత్తేజింపచేస్తూ,

-"సర్, క్లోసింగ్ టైమ్",
ఐ నీడ్ వన్మోర్,
-"సర్, పెరేడ్ గ్రౌండ్స్ వెనక, లాంబా దగ్గర, యూ మే గెట్ సార్",
మర్యాదగా మెడ పట్టి గెంతుతూ సర్వర్,
ఇచ్చిన టిప్ప్ పిడికిట్లో ఉండగానే,

నిమిషాల్లో కారెక్కి, గమ్యానికి చేరి,
ఎవర్నేమనడగాలో వెతుకుతుంటే,
చేరిన ఓ నీడ,
ఆ రాత్రి "స్నానించిన పువ్వులా",
మగ నీడా?
ఐతే, "కడిగిన కాయలా",
మందెక్కితే ఉపమానాలుప్మా తిన్నంతీజీ...

రాణిగంజ్ వరకు లిఫ్ట్ కావాల్ట,
మందక్కడే దొరుకుద్దట,
చొరవగా కారెక్కి చనువుగా తొడ గిల్లిన నీడ,
అకస్మాత్తుగా స్థానభ్రంశం చెందుతూ నీడ చెయ్యి,
నన్ను నాకపరిచితుణ్ణి చేస్తూ,
నీడ చెంపన సంతకమిచ్చిన నా వేళ్ళు,
కారాపకుండానే,

-"యూ రోగ్, వై డిడ్యూ గెట్ మీ ఇన్ దెన్,
అమ్ నాట్ అన్ ఆర్డినరీ పింప్, యూ @#$&"
పూర్తిగా పరిచయమై నన్ను
నాకు అసంపూర్ణంగా మిగిల్చి, నీడ..

ప్లీజ్, గెడ్డౌన్,
అమ్ నాట్ దట్ కైండ్, అండ్
అమ్ నాట్ దట్ "కైండ్" టూ,
కోపం, అసహ్యం, జాలి, బాధ, భయం
నా గొంతులో, రేడియో లో పాట,
"నిను వీడని నీడను నేను"....

దాహం చచ్చి, ద్వేషం పెరిగి,
పరిస్థితుల మీద,
ఒక్కడ్నే ఉన్నా,
ఎన్నో నీడల్నన్ను చూస్తున్నట్టు,
నా నీడే ఏదో రహస్యం దాస్తున్నట్టు.
ఏనాడో ఇవన్నీ తెలిసినట్టు.
అన్నీ కలిసి నన్ను కప్పేస్తున్నట్టు.
టాంక్ బండ్ మీద విగ్రహాల నీడలూ,
పుట్పాత్ జీవనాల జాడలూ,
చీకట్లో, ఏడుస్తున్న, స్త్రీ నీడ,
వెలుగు చూడ్డానికి ఉక్కిరిబిక్కిరయ్యే కన్నీటి గాథ,
ఏదో నిజం చెప్తున్నట్టు,
ఈ నీడలు,
ఏ నిజాలవో......

No comments:

Post a Comment