కరీంనగర్ హైవే,
శామీర్ పేట్ దాటి నిమిషాలంతే,,
మంద్రంగా పాట
"క్విట్ ప్లేయింగ్ గేమ్స్ విత్ మై హార్ట్" బాక్ స్ట్రీట్ బాయ్స్,
వెంటనే "సంబడీస్ మీ" ఎన్రిక్ ఎగ్లేసియా,
ఒంటరితనాన్ని, ఓటమిని
మరింత గుర్తుచేసే పాటల పీక తొక్కి
నిశ్శబ్దంలో, నీలాలు నిండిన కళ్ళతో,
అబ్సొల్యూట్ వోడ్కాతో, గుండెని మండిస్తూ,
స్టీరింగ్ తిప్పుతూ,
"ఐ లవ్ యూ, కానీ, నా వాళ్ళ ప్రాణం, నీ ప్రేమనోడించి....."
మూడ్నెల్లుగా... ప్రతిద్వనిస్తూ తన మాటలు, చెవుల్లో,
కోపాన్ని కార్ ఆక్సెలరేటర్ మీద చూపేలా చేస్తూ
120.. 130... 140... స్పీడోమీటర్ మాటవినకుండా,
ఎదురుగా ఏముందో కనపడనంత వేగంతో,
ఏదో విస్ఫోటించిన స్వనం,
ఎక్కడో ఆర్తనాదం ధ్వనించిన క్షణం
మత్తులో, చీకటి ముసుగులో,
ఎలాగో ఆరో అంతస్థులో ఇంటికి చేరి,
తర్వాతి రోజు సాయంత్రం,
ఫోన్రింగ్.. కలల్ని చీలుస్తూ, నాన్న.
-" అక్షయ..ఆక్సిడెంట్రా...
పోయింది, మూడ్నెల్ల కడుపుతో,
ఎవరికీ తెలీదు, పొస్ట్ మార్టమైందిపుడే,
పెళ్ళై రెణ్ణెల్లేగా, ఐ నో దట్ యూ వర్ ఇన్ లవ్,
రాత్రెవడో తాగుబోతు..శామీర్ పేట్ దగ్గరే అట,
హలో.. హలో, రేయ్, మాట్లాడు, ఏమైంది, హల్...."
జనరలాస్పత్రిలో ఫోరెన్సిక్ ప్రొఫెసర్,
వాలెట్లోని అక్షయ ఫోటో పిడికిట్లో పట్టుకుని,
తనని చేరడానికి ఆరో అంతస్థు
బాల్కనీని, పైకి దారడుగుతూ,
నిర్వేదంతో కళ్ళుమూసి..
No comments:
Post a Comment