తనే, నిజంగా, తనే..నా...
ఎనిమిదేళ్ళ క్రితం వొదిలి పోయిన
మంచువర్షం తిరిగి కురుస్తూ,
మంచిముత్యం మరల మెరుస్తూ,
ప్రేమలన్నింటికీ పెళ్ళవదు, అలాగే,
అన్ని పెళ్ళిళ్ళూ ప్రేమల్ని మరిపించలేవేమో,
"ఎలా ఉన్నావ్, పిల్లలూ? ఆయన?"
ఇలాంట్రోజొకటొస్తే చావాలనుకున్నా, కానీ,
తన్తో మాట్లాడాకా బ్రతకాలన్పిస్తూ,
దిగులు మొహంతో, వొణికే వేళ్ళతో,
నిన్నటి నా దేవత, శవంలా నేడు
-"బావున్నాను, పిల్లల్లేరు"
కాల్చిన గాయాల చేతిని చీరతో కప్పేస్తూ,
కూలిన ఆశల చెట్టుని, రాని నవ్వుతో, చిగురించేందుక్కష్టపడ్తూ,
నిజమేనా అన్న నా చూపుకి,
నిజంచెప్పాలనుకుంటూ,
-"వాడో శాడిశ్ట్, ఇంపొటెంట్,
పరిస్థితులకు భయపడి నిన్నొదులుకున్నందుకు....."
ఎప్పుడూ ఏడవన్నన్నేడిపిస్తూ,
కురిసిన తన కళ్ళు,
-"చేసిన తప్పుకు, నన్ను చూడలేక,
జారిన నా కలల్ని తిరిగివ్వలేక,
అమ్మ, నాన్న, కాలంతో ఓడి పో..యా..రు..
నాకంటూ మిగిలింది నా నీడ, నాటి నువ్వు,
ఇన్నాళ్ళకు రాగలిగాను బంధాల బందీలోంచి,
నిన్ను నమ్మించాలని కాదు, నిజం నమ్ము,"
నల్లకోటు లేని న్యాయంలా నా తను,
"నాన్నా" పరిగెత్తుకొస్తూ, నాలుగేళ్ళ నా కూతురు
అమ్మ దగ్గరికెపుడు తీస్కెళ్తావ్ అన్నన్నడుగుతూ,
ఆశ్చర్యంగా, ఏమైందని కళ్ళతో అడుగుతున్న "తన"కి,
చూపులాకాశానికి చేర్చి బదులిస్తూ,
అదిగోరా అమ్మ అంటూ , "తన"ని చూపించిన్నేను..,
పాపని హత్తుకుని వెచ్చగా విచ్చుకున్న తన నవ్వు,
పాప బుగ్గ మీదుగా నా నుదుటిని తాకి వేడి చెమ్మ మిగిల్చి...
రాదనుకున్న వసంతం వరించినట్టు,
లేదనుకున్న సమస్తం స్వాగతించినట్టు...
Pindesaav.. bosss.
ReplyDelete