మనిషి భావాల్లో లేని బలం,
వారిలోనూ ఉండదేమో....
అచేతనంలోనే ఉందంతా,
తీరని కోర్కెలు, తీయని కలలు,
నమ్మలేని భయాలు, చెరిగిపోని గుర్తులు,
అందుకే అహాన్నాడించేదదేగా,
సమ్మోహనంతో, సమాధ్యవస్థతో,
మనోవ్యాకులతలెన్నో మాయంచేయొచ్చోయ్,
ప్రేమ రాహిత్యమా? స్వానురాగమా?
"నార్సిస్సమ్" లేని మనిషెవడుంటాడు,
అందుకే కలలన్నీ, వాంఛాపూరణాలేగా,
తిండిలేనోడికి తింటున్నట్టు,
సోమరికి పన్జేస్తున్నట్టు..
కావాలంటే రా,
స్వప్న రహస్యాల్ని భేదిద్దాం,
నీరు జననానికి, ప్రయాణం మరణానికి,
గృహం దేహానికి, లయబధ్దక్రియలు సృష్టికార్యానికి,
ప్రతీకలేగా..
ఈడిపస్, ఎలక్ట్రా. కాంప్లెక్స్
శైశవకామ ఫలితాలంటే ఛీత్కరించారంతా,
కామమంటే ఒకే అర్ధమేనా,
నేననే విశ్లేషణని చూడరెందుకో,
లైంగిక విపర్యాలకు, వక్రతలకు, మూలం,
బాల్య పరిణామదశల స్ఠీరీభవనమేగా,
వోయేరిసమ్, సాడిసమ్, ఫెటిషిసమ్, మాసొకిసమ్, ,
వైపరీత్యాలన్నింటికీ చిన్నప్పటి ఘటనలేగా,అంటే
నవ్విపోయారంతా,
యూంగ్, యాడ్లర్, ఒట్టోరాంక్, ఇంకొందరు తప్ప,
ఇప్పటికీ నన్ను చూస్తే, చదవాలంటే భయమా???
నాకూ, పరిణయంగా మారిన ప్రణయముందోయ్,
ప్రేమలో,
భయాందోళనలు, అసూయాద్వేషాలు,
ఆనందోన్మాదాలు, నాకూ రుచే,
మనిషానందానికొకే మార్గం,
మనోవిష్లేశిస్తూ,
తన ఆలోచనలకి, అదుపు తప్పిన పనులకి, కారణం,
తన పరిణామంలోనే ఉందని తెల్సుకుంటే,
అంతవరకు,
మనిషో, మిధ్యా జీవి,
మనసో మ్లిష్ట స్వప్నం...
వారిలోనూ ఉండదేమో....
అచేతనంలోనే ఉందంతా,
తీరని కోర్కెలు, తీయని కలలు,
నమ్మలేని భయాలు, చెరిగిపోని గుర్తులు,
అందుకే అహాన్నాడించేదదేగా,
సమ్మోహనంతో, సమాధ్యవస్థతో,
మనోవ్యాకులతలెన్నో మాయంచేయొచ్చోయ్,
ప్రేమ రాహిత్యమా? స్వానురాగమా?
"నార్సిస్సమ్" లేని మనిషెవడుంటాడు,
అందుకే కలలన్నీ, వాంఛాపూరణాలేగా,
తిండిలేనోడికి తింటున్నట్టు,
సోమరికి పన్జేస్తున్నట్టు..
కావాలంటే రా,
స్వప్న రహస్యాల్ని భేదిద్దాం,
నీరు జననానికి, ప్రయాణం మరణానికి,
గృహం దేహానికి, లయబధ్దక్రియలు సృష్టికార్యానికి,
ప్రతీకలేగా..
ఈడిపస్, ఎలక్ట్రా. కాంప్లెక్స్
శైశవకామ ఫలితాలంటే ఛీత్కరించారంతా,
కామమంటే ఒకే అర్ధమేనా,
నేననే విశ్లేషణని చూడరెందుకో,
లైంగిక విపర్యాలకు, వక్రతలకు, మూలం,
బాల్య పరిణామదశల స్ఠీరీభవనమేగా,
వోయేరిసమ్, సాడిసమ్, ఫెటిషిసమ్, మాసొకిసమ్, ,
వైపరీత్యాలన్నింటికీ చిన్నప్పటి ఘటనలేగా,అంటే
నవ్విపోయారంతా,
యూంగ్, యాడ్లర్, ఒట్టోరాంక్, ఇంకొందరు తప్ప,
ఇప్పటికీ నన్ను చూస్తే, చదవాలంటే భయమా???
నాకూ, పరిణయంగా మారిన ప్రణయముందోయ్,
ప్రేమలో,
భయాందోళనలు, అసూయాద్వేషాలు,
ఆనందోన్మాదాలు, నాకూ రుచే,
మనిషానందానికొకే మార్గం,
మనోవిష్లేశిస్తూ,
తన ఆలోచనలకి, అదుపు తప్పిన పనులకి, కారణం,
తన పరిణామంలోనే ఉందని తెల్సుకుంటే,
అంతవరకు,
మనిషో, మిధ్యా జీవి,
మనసో మ్లిష్ట స్వప్నం...
This is fantastic.
ReplyDelete