కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Friday 6 July 2012

అసంపూర్ణం



ఎపుడైనా చావాలన్పించిందా,
ఎన్నడైనా నరకం చూసారా,
నిస్సహాయత పంచిన నిరాశ,
విశృంఖలత పెంచిన విరక్తి,
ఆప్యాయత లేని అవహేళన,
అనురాగం కాని అవమానం,
మండించి, దండించి, ముంచేసి, ముసుక్కప్పి,
కోపమై, శాపమై, కఠినమై, కంటకమై,
ఖండిత శిశ్నంతో, కాలిన చిహ్నంతో,
అనుకుని పుట్టానా అసంపూర్ణుడిలా,
కలగని పెరిగానా అసహజ ప్రకృతిలా,
నాలో విజాతి వికర్షణక్కారణం నేనా,
కుదిపేసే స్వలింగ ఘర్షణక్కారకం నేనా,
మేధావులారా, మెదడు చేసే మాయా రసాయనాల మర్మాలకి మనసుదా బాధ్యత,
నాడులు దూసే వ్యామోహ విచ్చుకత్తులగాట్లకి తనువుకా శిక్షిక,
నిజంగా మనుషులందరూ సంపూర్నులేనా,
నీతిగా మనసులందరివీ స్వచ్చాలేనా,
కురుక్షేత్రాన శిఖండి,
పాండవాఙ్నాతాన బృహన్నల పట్టపు రా రాణీవాసాలకు,
పట్టెడు వినోదానికీ అసంపూర్ణులమేగా,
మాకేం ఒద్దు, చినుకంత గౌరవం, నలుసంత ఊరట

No comments:

Post a Comment