కవితా మిత్రులకు, నమస్కారం

నా భావాల్ని, భాషని, కలల్ని, కలవరింతల్ని, ఆనందాల్ని, ఆరని తడినీ, ఉద్వేగాల్నీ, ఉద్దేశాల్ని, ఉద్రేకాల్నీ, ఉన్న స్థితిని, మీతో పంచుకొవాలనుకునే నా ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించి, అభినందిస్తారని, ఆస్వాదించి ఆహ్లాదిస్తారనీ, తప్పిదాలుంటే, దిద్దుకునే అవకాశమిస్తారనీ ఆశిస్తూ, మిమ్మల్ని "కవన వనం"లోకి, ఆహ్వానిస్తూ, మీ వంశీ..

Saturday, 7 July 2012

* నా లోకం *



నాదో లోకం, నాదలోకం,
మహాలోకం, కాదది మహీలోకం,
పలకరింపులో పది భావాలూ,
ప్రతీమాటలో మరో అర్ధమూ,
ఓదార్పుల్లో దాగని స్వార్ధం,
నవ్వుల వెనక దాగిన నిజాల
నిగ్గదీసే,

అదో లోకం, కాధదో లోకం,
మరోలోకం, చాలదు మరే లోకం,
నీలో నిన్ను తట్టి లేపే,
నిన్నలో రేపు గుట్టుచూపే,
మన్నులో మాతృత్వం గుర్తుచేసే,
మనుషుల్లో మనసుకి దిష్టి తీసే,

కర్మ లోకం, కారుణ్య లోకం,
నిన్ను నువ్ నిందించనవసరమే రాని,
బంధాల్ని కుంచించాలన్న తలపే రాని,
ఎవరి ఆలోచన్లకో బందీవయ్యే దౌర్బల్యం తాకనీని,
మేధలో అవలోకనాలెప్పటికీ ఆగనీని,
అద్భుత లోకం, అద్వైతపు లోకం....

No comments:

Post a Comment