ఎప్పట్లానే సూరీడు లేచాడు,
గంప కింద కోడీ అరిచింది,
అందరు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు,
ఎప్పటికీ ఇవన్నీ చూడ్డానికి నేనుంటానా.....
బ్రెయిన్ హెమరేజ్,
మెదడులో రక్తనాళం బద్దలైందట......
ఎప్పటినించో నీతో చెప్పలేకపోయిన ఊసుల ఒత్తిడికో
ఎలా నిన్ను చేరుకోవాలో అంతుపట్టక పెరిగిన గుండెచప్పుడుకో
నిన్ను నా అణువణువునా దాచుకుని చూస్కోవాలన్న కోరిక తీర్చడానికో
నాకంటూ ఏమీ మిగలని నాలో,నిన్నెలా నిలుపుకోగలనన్న అర్ధంలేని ఆలోచనతోనో
బాధ లేదు మృత్యువు ఒడిలో,నీ సడి వింటుంటే
భయంలేదు మరణం నీడలో, నా గోడు నీకు చెబుతుంటే
దుఃఖంలేదు చావు నడిలో, నా తోడు నీవని ఊహిస్తుంటే
కోపమూలేదు నిష్క్రమణ తడిలో, ఇప్పటికైనా నీతో చెప్పే ధైర్యం ఆవహిస్తుంటే,
కానీ
ఒకే బాద, నీ నవ్వు చూడలేనని,
ఒకే భయం,నువ్వెలా ఉండగలవో అని,
ఒకే దుఃఖం నీ మాటలు వినలేనని
ఒకే కోపం నీతో ఉండలేనని
1)నిజానికి ఇలాంటి కఠోర సత్యాలు ఉన్నట్టుండి తెలుస్తాయి మనకు...మీ కవితలో కూడా అలానే పరిచయం చేసారు ఆ కఠోర సత్యాన్ని...
ReplyDelete2)అతనికోచ్చిన ఆ బ్రెయిన్ హెమరేజ్ ki గల కారణాలని మనసుతో వెతుక్కోవటం బాగుంది...
3)బాధ , భయం, దుఖం , కోపం అనే నాలుగు మనిషి తాలుకు భావనల్ని పూర్తి బిన్న మైన పరిస్తితుత్ల్లో మీరు ఉపోయోగించిన తీరు మాత్రం అద్భుతం...
కాని దాదాపుగా బాధ ,దుఖం ఒక దాని తర్వాత ఒకటి వచ్చేవి కదా, ...ఎందుకని ఇవి రెండూ తీసుకున్నారు ??లెక్క ప్రకారమైతే ఏదో ఒక్కటే తీసుకోవాలి కాని...!!!
ReplyDeleteఅన్నిసార్లూ బాధ బైటికి చూపలేం,కానీ, దుఖం మన ప్రమేయం లేకుండానే బైటిక్కనపడుతుంది, :) so, alaa vaadaanu,
ReplyDeletehi..........
ReplyDelete