నా శ్వాసలో కలిసిన నువ్,
ఆపేసావ్ ఊపిరినే, నన్నొదిలి....
నీ ఆశలో బ్రతికిన్నేను,
ఆర్పలేను నీ వెలుగునే, నిను మరచి....
నేను బానేఉన్నా, అనుకునేవారికి బాధలో ఉన్నాననెలా చెప్పేది
కళ్ళేడిస్తే, సంతోషమెక్కువైందా అనడిగేవారికి, కనపడని గాయాన్నెలా
చూపేది,
నా ఆనందం నీవల్లే అంటే నమ్మిన అందరూ,
నా ఆక్రందనలూ నీ వల్లే అంటే నవ్వరా,
నీ కోసం కొంచెం మారినా పసిగట్టే అందరూ
శోకం నన్నింత మార్చినా గుర్తించరా....
జంటగా ఉంటే పలకరించిన అందరూ,
ఒక్కడ్ని చూసి ఒంటరిని చేస్తున్నారెందుకు...
నువ్విక రావని తెలిసాక, చచ్చి,మళ్ళీ పుట్టాను,
నువ్వెప్పుడొస్తావని వీళ్ళడుగుతుంటే రోజూ చస్తున్నా...
ఒక్కసారి కనపడి, ఇంకెపుడూ కనపడనని,
ఒక్కసారి వినపడి, ఇంకెపుడూ వినపడనని,
అందరికీ చెప్పవా "నువ్ లేవని, ఇక రావని"....
No comments:
Post a Comment