యుగాల మౌనాన్ని కరిగించిన తను,
నాతో నేను మాట్లాడుకున్నట్టుంది
ధైర్యమిచ్చింది, నాలో నేను ఆవహించుకున్నట్టుంది,,
నవ్వింది, నా బాధలు మరిచేట్టు,
నవ్వించింది, నన్ను నేను గుర్తించేట్టు,
ఒక్కసారి కాలాన్ని వెనక్కి తిప్పి,
తనని మళ్ళీ కొత్తగా ప్రేమించి,
బాధించిన క్షణాల్ని హరించి,
ఆనందించిన సుఖాల్ని స్మరించాలనుంది
ప్రేమకింత బలముందని ఇప్పుడే అన్పిస్తుంది,
అదీ తను చెప్తేనే,
ప్రేమకూ బాధ్యతుందని తెలిసొస్తూంది,
ఏదో, తను చూపితేనే
తనని మరవాలా, నేనంటే తనే ఐనపుడు,
తనకి దూరంగా బ్రతకాలా, నేనంతా తనే ఉన్నపుడు, కానీ
ఏదో రోజు తప్పక కలుస్తా,
ఏదో జన్మలో తప్పక వరిస్తా,
తనకోసమెప్పటికీ వేచే..నేను....
No comments:
Post a Comment